Budget2020: నేడు కూడా.. నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • పరిమిత లావాదేవీలు జరిపిన మదుపర్లు
  • మార్కెట్లపై ఇవాళ కూడా కొనసాగిన కరోనా భయం 
  • సెన్సెక్స్ 190.. నిఫ్టీ 73 పాయింట్ల నష్టం

రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లలో పరిమిత లావాదేవీలు జరిగాయి. మదుపరులు కేంద్ర బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి స్పందించారు. మరోవైపు కరోనా వైరస్ భయాందోళనలతో ఇవాళ్టి ట్రేడింగ్ సాదాసీదాగా ముగిసింది. సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 40,723 వద్ద స్థిరపడగా, నిఫ్టీ సైతం అదే బాటలో నడిచింది. 73 పాయింట్లు నష్టపోయి 11,962 వద్ద క్లోజయింది. నేటి ట్రేడింగ్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్ బీఐ, ఎయిర్ టెల్ వంటి షేర్లు లాభాలు ఆర్జించగా, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ వంటి షేర్లు నష్టాలు చవిచూశాయి.

Budget2020
BSE
NSE
Sensex
Nifty
CoronaVirus
  • Loading...

More Telugu News