Buddha Venkanna: శుక్రవారం కోర్టుకు పోకుండా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఏంటి విజయసాయిరెడ్డిగారూ!: బుద్ధా వెంకన్న

  • విజయసాయిరెడ్డిపై బుద్ధా సెటైర్
  • మీ మాటలు నమ్మేవాళ్లెవరూ లేరని ట్వీట్
  • మీకు, జగన్ కు సన్మానాలు చెయ్యాలా అంటూ వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో నిత్యం ఏదో ఒక అంశంపై టీడీపీని విమర్శిస్తుండడం పరిపాటి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. శుక్రవారం కోర్టుకు పోకుండా ట్విట్టర్ లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు విజయసాయిరెడ్డిగారూ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

ఈ 8 నెలల్లో ఉత్తరాంధ్రకు వైఎస్ జగన్ ఏంచేశారో చెప్పలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్దరిస్తామంటే నమ్మే అమాయకులు ఎవరూ లేరు అంటూ ట్వీట్ చేశారు. విశాఖలో మొదలుపెట్టి భీమిలి వరకు భూములు కొట్టేస్తున్నందుకు ఉత్తరాంధ్ర ప్రజలు మీకు, జగన్ గారికి సన్మానం చెయ్యాలా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

Buddha Venkanna
Vijay Sai Reddy
Jagan
Court
Friday
  • Loading...

More Telugu News