Janagoan: జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

  • రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో ఘటన
  • రియాక్టర్లకు చార్జింగ్ పెడుతుండగా అంటుకున్న మంటలు
  • భయంతో పరుగులు తీసిన సిబ్బంది

తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఖిలాషాపూర్‌లోని తారా ఇండస్ట్రీస్ టిన్నర్ పరిశ్రమలో రియాక్టర్లకు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పరిశ్రమ మొత్తం మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

 సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతుండడంతో వాటిని అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Janagoan
Khila shapoor
Fire Accident
Telangana
  • Loading...

More Telugu News