Boy: కామారెడ్డిలో ఘోరం... ఉడుకుతున్న మటన్ లో పడి చిన్నారి దుర్మరణం!

  • మదాంగపల్లిలో దారుణం
  • ఆడుకుంటూ వెళ్లి గుండిగలో పడ్డ చిన్నారి
  • చికిత్స పొందుతూ కన్నుమూత

బంధువుల ఇంట్లో జరుగుతున్న దశదిన కర్మకు హాజరయ్యేందుకు వెళ్లిన దంపతులు, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ దూరమై, ఇప్పుడు పుట్టెడు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన గౌతమి, అర్జున్ దంపతులు, తమ ఐదేళ్ల కుమారుడు రోహన్ తో కలిసి కామారెడ్డి జిల్లా మదాంగపల్లిలో జరుగుతున్న బంధువుల దశదిన కర్మకు హాజరయ్యారు.

బయట ఆడుకుంటున్న బాలుడు, విందు నిమిత్తం ఆరు బయట కట్టెల పొయ్యిని అమర్చి మాంసం కూర వండుతున్న పెద్ద గుండిగలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. దీంతో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న బంధువులు హుటాహుటిన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Boy
Mutton Curry
Died
Kamareddy District
Madangapalli
  • Loading...

More Telugu News