Narendra Modi: దటీజ్ మోదీ చరిష్మా.. అందుకే మా పార్టీలో చేరుతున్నారు: బీజేపీ నేత లక్ష్మణ్

  • మోదీ పనితీరు కారణంగానే సైనా నెహ్వాల్ వంటి వారు చేరుతున్నారు
  • సైనా చేరికతో బలపడనున్న బీజేపీ
  • మరెంతో మంది రానున్నారన్న లక్ష్మణ్

భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు క్యూ కడుతున్నారని, ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న చరిష్మా, ఆయన పనితీరు కారణంగానే సైనా నెహ్వాల్ వంటి వారు పార్టీలో చేరుతున్నారని అన్నారు. తాజాగా జాతీయ వార్తా సంస్థ 'పీటీఐ'తో మాట్లాడిన ఆయన, బ్యాడ్మింటన్ లో అసమాన ప్రతిభను చూపిన సైనా నెహ్వాల్ చేరిక, బీజేపీకి బలాన్ని చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆమె వంటి క్రీడాకారులకు బీజేపీ వంటి జాతీయ పార్టీయే సరైన వేదికని అన్నారు. బీజేపీలో చేరి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉందని అన్నారు.

Narendra Modi
Lakshman
Saina Nehwal
BJP
  • Loading...

More Telugu News