Jagan Shakti: తీవ్ర అస్వస్థతతో బాలీవుడ్ దర్శకుడు జగన్‌శక్తి.. ఆసుపత్రి ఖర్చులు భరిస్తున్న అక్షయ్ కుమార్!

  • మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడంతో కుప్పకూలిపోయిన జగన్‌శక్తి
  • అతని దర్శకత్వంలో 'మిషన్ మంగళ్' చేసిన అక్షయ్  
  • కోలుకుంటున్న దర్శకుడు

ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ దర్శకుడు జగన్‌శక్తికి స్టార్ హీరో అక్షయ్ కుమార్ అండగా నిలిచాడు. ఆసుపత్రి వైద్య ఖర్చులను భరిస్తూ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఇటీవల ఓ శుభకార్యంలో పాల్గొన్న దర్శకుడు జగన్.. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ముంబైలోని ఆసుపత్రిలో చేర్చి అత్యవసర వైద్య సాయం అందిస్తున్నారు.

జగన్ శక్తి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ఇటీవల ‘మిషన్ మంగళ్’ చేశాడు. బాక్సాఫీసు వద్ద ఇది సంచలన విజయాన్ని అందుకుంది. జగన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అక్షయ్ చికిత్స ఖర్చులు మొత్తం భరిస్తూ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. జగన్ కుటుంబ సభ్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ కోలుకునే వరకు వారితోనే ఉండాలని తన సిబ్బందికి అక్షయ్ సూచించాడు. కాగా, ఆసుపత్రిలో చేరిన జగన్ కోలుకుంటున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Jagan Shakti
Akshay kumar
Bollywood
  • Loading...

More Telugu News