Renigunta: రేణిగుంట ఎయిర్ పోర్టులో చైనీయులు ప్రత్యక్షం... హడలిపోయిన ఇతరులు!

  • చైనాలో వణికిస్తున్న కరోనా వైరస్  
  • భారత్ లోనూ భయాందోళనలు
  • రేణిగుంట ఎయిర్ పోర్టులో కనిపించిన 15 మంది చైనీయులు
  • తాము బెంగళూరు నుంచి వస్తున్నట్టు వెల్లడి

కరోనా వైరస్ కారణంగా చైనా పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఏకంగా చైనీయులు కనిపిస్తే ఇంకెంత హడలిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఏపీలోని రేణిగుంట విమానాశ్రయంలో ఒక్కసారిగా 15 మంది చైనా జాతీయులు కనిపించేసరికి ఇతరులు భయాందోళనలకు లోనయ్యారు. వారంతా ముఖాలకు మాస్కులు ధరించి కనిపించడంతో ఎయిర్ పోర్టు వర్గాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఆ చైనీయులను ప్రశ్నించగా, తాము వస్తోంది చైనా నుంచి కాదని, బెంగళూరు నుంచి అని చెప్పడంతో వాతావరణం తేలికపడింది.

Renigunta
Airport
China
CoronaVirus
Bengaluru
  • Loading...

More Telugu News