Avanthi Srinivas: విశాఖ బ్రాండ్ ఇమేజ్ పై టీడీపీ నేతలు బురదజల్లుతున్నారు: అవంతి

  • టీడీపీ నేతలపై అవంతి ఫైర్
  • విశాఖ బ్రాండ్ ఇమేజ్ పై బురదజల్లుతున్నారంటూ ఆగ్రహం
  • చంద్రబాటు కుటిల యత్నాలు చేస్తున్నారని ఆరోపణ

టీడీపీ నేతలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ పై టీడీపీ నేతలు బురదజల్లుతున్నారని మండిపడ్డారు. విశాఖ ప్రజాప్రతినిధులు అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. విశాఖతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. విశాఖపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పరిపాలన రాజధాని కాకుండా చంద్రబాబు కుటిలయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజల్ని మోసం చేయొద్దని హితవు పలికారు. 'చేతులెత్తి నమస్కరిస్తున్నా, విశాఖపై విషం చిమ్మొద్దు' అంటూ విజ్ఞప్తి చేశారు.

Avanthi Srinivas
Visakhapatnam
Telugudesam
Chandrababu
YSRCP
Amaravati
AP Capital
  • Loading...

More Telugu News