Jagan: సీఎం జగన్ ను కలిసిన సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్

  • తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ
  • జస్టిస్ చలమేశ్వర్ ను సత్కరించిన జగన్
  • జ్ఞాపిక బహూకరణ

ఏపీ సీఎం జగన్ ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన చలమేశ్వర్ సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా న్యాయకోవిదుడు చలమేశ్వర్ ను సీఎం జగన్ శాలువా కప్పి గౌరవించారు. ఆపై జ్ఞాపికను బహూకరించారు. సీఎం జగన్ ను కలిసినవారిలో చలమేశ్వర్ తో పాటు అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు.

Jagan
Jasti Chalameshwar
Supreme Court
Thadepalli
CM Camp Office
Yarlagadda
  • Loading...

More Telugu News