Mahatma Gandhi: సత్యాగ్రహం ద్వారా ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని మహాత్మా గాంధీ నిరూపించారు: సీఎం కేసీఆర్

  • అహింస, సత్యాగ్రహం ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చారు
  • మహాత్మాగాంధీ మార్గం ఎప్పటికీ అచరణీయం
  • సత్యాగ్రహ దీక్షతో అనేక సమస్యలను పరిష్కరించారు

సత్యాగ్రహం ద్వారా ఎంతటి కష్టసాధ్యమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చని మహాత్మాగాంధీ నిరూపించారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అహింస సత్యాగ్రహ సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన మహాత్మా గాంధీ అనుసరించిన మార్గం ఎప్పటికీ అచరణీయమన్నారు. తన సత్యాగ్రహ దీక్షతో గాంధీజీ అనేక సమస్యలకు పరిష్కారం చూపెట్టారని కొనియాడారు. జాతి ఆయన చూపెట్టిన మార్గంలో పయనిస్తూ.. ఆయన కలలుకన్న భారతదేశాన్ని ఆవిష్కరించాలని పేర్కొన్నారు.

Mahatma Gandhi
Death Anniversary
KCR
Comments
Telangana
  • Loading...

More Telugu News