Census: జనగణనలో ఇళ్లకు సంబంధించిన వివరాలను కూడా నమోదు చేయాలని కేంద్రం ఆదేశం
- ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జనగణన
- ఇళ్లకు సంబంధించి 31 ప్రశ్నలు అడగాలన్న కేంద్రం
- వ్యక్తిగత ఆస్తులు, వాహనాలపైనా ప్రశ్నలు
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జనగణన నిర్వహించనున్నారు. ఈ జనగణనలో భాగంగా ఇళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇళ్లకు సంబంధించి 31 వివరాలు మదింపు చేయాలని స్పష్టం చేసింది. ప్రతి ఇంటి వివరాలు జనగణనలో నమోదై ఉండాలని కేంద్రం పేర్కొంది. ఇంటికి సంబంధించి 5 ప్రశ్నలు, ఇంటి యజమానికి సంబంధించి 2 ప్రశ్నలు, ఇంట్లోని మౌలిక సదుపాయాల గురించి 20 ప్రశ్నలు అడగాలని సూచించింది. వ్యక్తిగత ఆస్తులు, వాహనాలపైనా ప్రశ్నలు అడగాలని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.