AP Capital: ఢిల్లీని తాకేలా మూడు రాజధానుల ఉద్యమం : ఏపీ మంత్రి కన్నబాబు

  • రాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపనున్నట్లు వెల్లడి
  • రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది మంచి నిర్ణయం
  • రాజధానిపై నిర్ణయానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు

రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఢిల్లీ పెద్దలకు తెలిసేలా పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతికి పోస్టు కార్డులు రాయనున్నట్లు తెలిపారు.

అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే రాజధాని వికేంద్రీకరణ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి అడ్డుపడుతున్నారని, మండలి రద్దు విషయంలోనూ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పుకొచ్చారు.

AP Capital
three capitals
postcard agitation
Kannababu
  • Loading...

More Telugu News