Male Escort: 'మేల్ ఎస్కార్ట్'గా రోజుకు రూ. 15 వేల సంపాదన అంటూ... 1200 మందికి బురిడీ!

  • లొకాంటోలో మేల్ ఎస్కార్ట్ ప్రకటనలు
  • ఆశపడ్డ వారిని అడ్డంగా ముంచేసే దుర్గా ప్రసాద్
  • కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్ కేంద్రంగా మేల్ ఎస్కార్ట్ పేరిట హనీట్రాప్ పన్నిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దుర్గా ప్రసాద్ చేతిలో మోసపోయిన బాధితులు దాదాపు 1200 మందికి పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కొందరు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే, లొకాంటో వెబ్ సైట్ లో మేల్ ఎస్కార్ట్ గా పనిచేసి, రోజుకు రూ. 15 వేల వరకూ సంపాదించుకోవచ్చని దుర్గా ప్రసాద్ ప్రకటనలు గుప్పించేవాడు. తమ విధిలో భాగంగా డబ్బున్న అమ్మాయిలను, మహిళలను కలిసి, వారిని సుఖపెడితే చాలని చెప్పేవాడు.

వాటిని చూసి, ఎవరైనా సంప్రదిస్తే, అందమైన అమ్మాయిల చిత్రాలను వారికి పంపించేవాడు. వారికి మేల్ ఎస్కార్ట్ అవసరమని, అయితే, వారి వద్దకు పంపేముందు తనకు రూ. 1000 చెల్లించాలని షరతు పెట్టేవాడు. ఆశపడ్డ యువకులు అతను చెప్పిన మొత్తాన్ని చెల్లించిన తరువాత వారి నంబర్ బ్లాక్ లిస్టులో చేర్చేవాడు. తాము మోసపోయామని గ్రహించినా, చెల్లించింది కొద్ది మొత్తమే కాబట్టి, పోలీసులను ఆశ్రయించేందుకు వందలాది మంది వెనుకాడారు. ఇదే అదనుగా దుర్గా ప్రసాద్ మరింత మందిని మోసం చేశాడు. తమకు జరిగిన మోసంపై కొందరు కేసు పెట్టగా, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News