Rador: గోడ అడ్డుగా ఉన్నా... అవతల ఏముందో చెప్పే రాడార్ ను సృష్టించిన బెంగళూరు శాస్త్రవేత్తలు!

  • బియ్యపు గింజకన్నా చిన్న చిప్
  • మూడేసి ట్రాన్స్ మీటర్లు, రిసీవర్లు
  • సీఎంఓఎస్ టెక్నాలజీ సాయంతో తయారీ

బలమైన గోడే అడ్డుగా ఉన్నా ఆవల ఏముందో కనిపెట్టగల రాడార్ సిస్టమ్ ను బెంగళూరులోని ఐఐఎస్సీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్) సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఈ రాడార్ వ్యవస్థ చిన్న బియ్యపు గింజకన్నా తక్కువ పరిణామమున్న చిప్ పై అమర్చడం విశేషం. మూడు ట్రాన్స్ మీటర్లు, మూడు రిసీవర్లు, రాడార్ సంకేతాలను తయారు చేసే అత్యాధునిక ఫ్రీక్వెన్సీ సింథసైజర్ ఇందులో భాగంగా ఉంటాయి. సీఎంఓఎస్ (కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్) టెక్నాలజీని వినియోగిస్తూ, ఈ బుల్లి రాడార్ ను డెవలప్ చేసినట్టు ఐఐఎస్సీ అసోసియేట్ ప్రొఫెసర్ గౌరవ్ బెనర్జీ తెలిపారు. రక్షణ రంగంతో పాటు ఆరోగ్య, రవాణ, వ్యవసాయ రంగాల్లో ఈ రాడర్ ఆవిష్కరణ కీలకంగా మారుతుందని తాము భావిస్తున్నట్టు గౌరవ్ తెలియజేశారు.

  • Loading...

More Telugu News