Palla Rajeshwar: హుజూర్ నగర్ లో సీటు కోల్పోయినా ఉత్తమ్ బుద్ధి మారలేదు: పల్లా రాజేశ్వర్

  • ఈసీపై ఒత్తిడి తెచ్చి కేవీపీని ఎక్స్ అఫిషియోగా చేర్చారంటూ ఆగ్రహం
  • కాంగ్రెస్ నేతలకు చట్టాలపై అవగాహన లేదంటూ విసుర్లు 
  • టీఆర్ఎస్ ఘన విజయంతో విపక్షాలకు దిమ్మతిరిగింది  

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో ఆ పార్టీ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. హుజూర్ నగర్ లో సీటు కోల్పోయినా ఉత్తమ్ కుమార్ బుద్ధి మారలేదని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తీసుకువచ్చి కేవీపీని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా చేర్చారని ఉత్తమ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలకు చట్టాలతో పనిలేదని, చట్టాలపై కనీస అవగాహన కూడా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు శరీరాలు పెరిగాయే తప్ప బుద్ధి పెరగలేదని అన్నారు. పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయంతో విపక్షాలకు దిమ్మదిరిగిపోయిందని ఎద్దేవా చేశారు.

Palla Rajeshwar
Uttam Kumar Reddy
Huzurnagar
TRS
Congress
Municipal Elections
  • Loading...

More Telugu News