Prashanth Kishore: జేడీయూ నుంచి బహిష్కరించడంపై స్పందించిన ప్రశాంత్ కిశోర్

  • జేడీయూ నుంచి ప్రశాంత్ కిశోర్ అవుట్
  • నితీశ్ కుమార్ కు థ్యాంక్స్ చెప్పిన ప్రశాంత్ కిశోర్
  • మళ్లీ మీరే సీఎం కావాలంటూ ట్వీట్

జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పై విమర్శలు చేసిన ఫలితంగా ప్రశాంత్ కిశోర్ పై వేటు పడింది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జేడీయూ హైకమాండ్ పేర్కొంది. దీనిపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తనను సస్పెండ్ చేయడంపై నేరుగా ఏమీ అనని ప్రశాంత్ కిశోర్, ట్విట్టర్ లో నితీశ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ మీరే సీఎం కావాలని కోరుకుంటున్నానని, ఆ దేవుడి ఆశీస్సులు మీకు లభించాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. గతకొంతకలంగా నితీశ్, ప్రశాంత్ కిశోర్ మధ్య పొరపొచ్చాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ తనను బాహాటంగా విమర్శించడాన్ని నితీశ్ సహించలేకపోయారు.

Prashanth Kishore
JDU
Nitish Kumar
Bihar
  • Loading...

More Telugu News