Vijay Sai Reddy: నాగార్జునకు గ్రీన్ చాలెంజ్ విసిరిన విజయసాయిరెడ్డి

  • గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన విజయసాయి
  • మరికొందర్ని నామినేట్ చేసిన వైసీపీ ఎంపీ
  • విజయసాయికి థ్యాంక్స్ చెప్పిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్

తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా ముందుకు వెళుతోంది. తాజాగా ఈ చాలెంజ్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వీకరించారు. చాలెంజ్ లో భాగంగా విశాఖలోని పెద రిషికొండ జీవీఎంసీ పార్క్ లో మూడు మొక్కలు నాటారు.

ఆపై చాలెంజ్ లో భాగంగా సినీ నటుడు అక్కినేని నాగార్జునను నామినేట్ చేశారు. నాగ్ తో పాటు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, జీవీఎంసీ సిబ్బందిని నామినేట్ చేశారు. కాగా, దీనిపై టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Vijay Sai Reddy
Nagarjuna
Green India Challenge
Santosh Kumar
TRS
  • Loading...

More Telugu News