Cricket: టీ20ల్లో.. ధోనీ రికార్డును అధిగమించిన కోహ్లీ

  • టీ20ల్లో కోహ్లీ 1114 పరుగులతో దేశంలో టాప్
  • ప్రపంచంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెస్సెస్ టాప్
  • రెండో స్థానంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో భారత్ ఆడుతున్న మూడో టీ20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. కెప్టెన్ గా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ధోనీ(1112 పరుగులు) రికార్డును అధిగమించాడు. కోహ్లీ టీ20ల్లో 1114 పరుగులు చేసి దేశంలో టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు.

కాగా, ప్రపంచంలో కెప్టెన్ గా అత్యధికంగా పరుగుల చేసిన వారిలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెస్సెస్ 1273 పరుగులతో టాప్ లో ఉండగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 1148 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా మ్యాచ్ లో కోహ్లీ 38 పరుగులు చేశాడు. ఇందుకు  27 బంతులు ఎదుర్కొన్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో  ఒక సిక్స్, 2 బౌండరీలు ఉన్నాయి.

Cricket
T20 Matches
Virat Kohli
Captain
Record Runs
  • Loading...

More Telugu News