Ranga Reddy District: తుక్కుగూడ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది: టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

  • ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కేసీఆర్‌ దాన్ని తుంగలో తొక్కారు
  • ప్రజా తీర్పును టీఆర్‌ఎస్‌ అవమానించింది
  • దీనికి త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చినా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వారిని అవమానించిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దొడ్డిదారిలో అధికారం చేజిక్కించుకున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు. ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చైర్మన్‌ పదవి నైతికంగా బీజేపీదేనని, అధికారం కోసం కాంగ్రెస్‌ సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చి నీచరాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

కేసీఆర్‌, కేటీఆర్‌ పతనానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నాంది కాబోతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజురోజుకీ పుంజుకుంటున్న బీజేపీ ఎదుగుదలను చూడలేక కేసీఆర్‌ అణచివేత చర్యలకు దిగుతున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. కేసీఆర్‌ ఎన్ని కుట్రలు పన్నినా మోదీ నిర్ణయాలే బీజేపీకి బలమన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కు జనం తగిన బుద్ధి చెప్పారన్నారు. 

Ranga Reddy District
tukkuguda muncipality
BJP
lakshman
  • Loading...

More Telugu News