Amaravati: విశాఖలో భూదందా కోసమే జగన్‌ తాపత్రయం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా

  • జి.ఎన్‌.రావు కమిటీతో తప్పుదోవ పట్టించింది అందుకే
  • నాడు అమరావతికి సై అని ఇప్పుడు మోసం చేస్తున్నారు
  • త్వరలోనే బీజేపీ-జనసేన కార్యాచరణ

విశాఖ ప్రజలపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఎటువంటి ప్రేమాభిమానాలు లేవని, కేవలం అక్కడ భూదందా కోసమే రాజధానిని మారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇందుకోసమే బి.ఎన్‌.రావు కమిటీ వేశారని, ఆ కమిటీ చెప్పింది ఒకటైతే జగన్‌ చెబుతున్నది మరొకటని విమర్శించారు.

ఈ రోజు ఓ చానెల్‌ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జైకొట్టి అధికారంలోకి రాగానే మాటమార్చిన జగన్‌ ప్రజల్ని నిలువునా వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ది నియంతృత్వ ధోరణి అని, ఇగో పాలు కూడా ఎక్కువని, అందుకే ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండదని విమర్శించారు. అమరావతిలో నేల గట్టిదనం లేదని చెప్పడం హాస్యాస్పదమని, ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ కోసం త్వరలోనే జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

Amaravati
Visakhapatnam
AP Capital
Kanna Lakshminarayana
  • Loading...

More Telugu News