Movie Chance: హీరో చెల్లి పాత్ర ఇస్తామని చెప్పి... యువతిని మోసం చేసిన కేటుగాళ్లు!

  • సినిమాల్లో నటించేందుకు వచ్చిన తూ.గో యువతి
  • అవకాశం కోసం ప్రయత్నిస్తే మోసం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఎలాగైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్ కు వచ్చిన ఓ యువతి, మోసగాళ్ల బారినపడింది. సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి, సినిమాల్లో అవకాశాల కోసం నగరానికి వచ్చి, ఎస్సార్ నగర్ లో ఉన్న ఓ హాస్టల్ లో చేరింది. సినిమాల్లో అవకాశాల కోసం ఇంటర్నెట్ లో అన్వేషిస్తుండగా, ఓ నంబర్ కనిపించింది. దానికి కాల్ చేయగా, తమ తదుపరి చిత్రంలో హీరో సోదరి పాత్ర ఉందని, అది ఇస్తామని వారు నమ్మబలికారు.

ఆపై తొలుత రిజిస్ట్రేషన్ పేరిట రూ. 500 తీసుకున్నారు. యువతి బుట్టలో పడిందన్న నిర్ణయానికి వచ్చేసిన కేటుగాళ్లు, పలు కారణాలు చెబుతూ, పలు దఫాలుగా ఆమె నుంచి రూ. 30 వేలు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. ఎంతకీ సినిమా అవకాశం రాకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Movie Chance
Lady
East Godavari District
Fruad
Police
  • Loading...

More Telugu News