Shriya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాజమౌళి చిత్రంలో శ్రియ 
  • శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరి' అప్ డేట్ 
  • తేజ దర్శకత్వంలో గోపీచంద్ సినిమా

 *  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ప్రముఖ నటి శ్రియ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణ్ సరసన ఆమె నటిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఛత్రపతి' సినిమాలో శ్రియ నటించిన సంగతి విదితమే.
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న 'లవ్ స్టోరి' చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. కుల సమస్యలను ఈ చిత్రంలో చర్చిస్తున్నట్టు చెబుతున్నారు. ఏప్రిల్ 2 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
*  గతంలో తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం' చిత్రం గోపీచంద్ కు విలన్ గా మంచి పేరుతెచ్చిపెట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కలయికలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి కథ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Shriya
Rajamouli
Shekhar Kammula
Sai Pallavi
Gopichand
  • Loading...

More Telugu News