Rajinikanth: ఐయాం ఫైన్.. ఆందోళన వద్దు: గాయాలపై రజనీకాంత్ వివరణ

  • బేర్ గ్రిల్స్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో పాల్గొన్న రజనీకాంత్
  • గాయాలయ్యాయంటూ వార్తలు
  • బాగానే ఉన్నానన్న సూపర్ స్టార్

తనకేం కాలేదని, తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. ప్రముఖ సాహసికుడు బేర్ గ్రిల్స్ నిర్వహించే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ గాయపడ్డాడంటూ నిన్న ఓ వార్త వైరల్ అయింది. హల్‌చల్ చేస్తున్న ఈ వార్తలపై స్పందించిన రజనీకాంత్..  చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

తనకు ఎటువంటి గాయాలు కాలేదని, చెట్టు కొమ్మలు చేతులపై గీసుకున్నాయని, అంతకుమించి మరేం జరగలేదని పేర్కొన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.  

  • Loading...

More Telugu News