YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసు.. ఫలానా వ్యక్తులపై అనుమానం వుందంటూ హైకోర్టుకు పేర్ల జాబితా సమర్పించిన వివేకా కూతురు!

  • ఈ కేసుకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరోపణలేవీ లేవు
  • కాకపోతే, కొందరిపై అనుమానాలు ఉన్నాయి
  • పేర్ల జాబితాను పిటిషన్ లో జతపరిచిన సునీత

వైయస్ వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరోపణలేవీ చేయడం లేదని తన పిటిషన్ లో పేర్కొన్న సునీత, కొందరిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయా వ్యక్తుల పేర్ల జాబితాను తన ఫిర్యాదులో పొందుపరిచారు.

ఆ జాబితాలో.. వాచ్ మెన్ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పేర్లు ఉన్నాయి. వివేకా హత్య జరిగిన రోజున సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు, తమ సన్నిహితుల సూచనల మేరకు ఈ జాబితాను కోర్టుకు సునీత సమర్పించినట్టు సమాచారం.

YS Vivekananda Reddy
murder case
High Court
Daughter sunita
  • Loading...

More Telugu News