YSRCP: జగన్‌ జైలుకి వెళితే ముఖ్యమంత్రి కావాలని వారిద్దరూ తపన పడుతున్నారు: పంచుమర్తి అనురాధ

  • సీఎం కావాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన తపన
  • ప్రజల గొంతుక వినిపిస్తోన్న టీడీపీ నేతలను రౌడీలతో పోల్చుతున్నారు 
  • రాజధాని రైతుల ఆందోళనల గురించి పట్టించుకోవట్లేదు

వైసీపీ నేతలపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సరికాదని అన్నారు. మంగళగిరిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
జగన్‌ జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి కావాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ తపన పడుతున్నారని ఆరోపించారు.
 
ప్రజల గొంతుక వినిపిస్తోన్న టీడీపీ నేతలను వీధి రౌడీలతో పోల్చుతున్నారని పంచుమర్తి అనురాధ విమర్శించారు. మీడియా ముందుకు వచ్చి బొత్స ఏం చెబుతున్నారో ఎవరికీ అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును విమర్శించడమే పనిగా వైసీపీ నేతలు పెట్టుకున్నారని, రాజధాని రైతుల ఆందోళనల గురించి పట్టించుకోవట్లేదని ఆమె విమర్శించారు.

YSRCP
Telugudesam
Panchumarthi Anuradha
  • Loading...

More Telugu News