Arvind Kejriwal: ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా?: కేజ్రీవాల్ పై మండిపడ్డ జీవీఎల్

  • షర్జిల్ ఇమామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు
  • కన్హయ్యను రక్షించినట్టే షర్జిల్ ను కూడా దాచిపెట్టారు
  • ఆప్ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన విద్యార్థి షర్జిల్ ఇమామ్ గురించి కేజ్రీవాల్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. విద్యార్థుల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఒక దేశద్రోహి మాదిరి మాట్లాడిన షర్జిల్ గురించి కనీసం స్పందించలేదని అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజద్రోహం కేసుల్లో ఉన్న కన్హయ్యతో పాటు ఇతరులను గతంలో కాపాడిన విధంగానే ఇప్పుడు షర్జిల్ ఇమామ్ ను కూడా మీరు దాచిపెట్టారంటూ కేజ్రీవాల్ పై ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆప్ పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే.

Arvind Kejriwal
AAP
GVL Narasimha Rao
BJP
Sharjeel Imam
  • Loading...

More Telugu News