Suman: వేంకటేశ్వరస్వామి పాత్ర కోసం అంతగా కష్టపడ్డాను: హీరో సుమన్

  • 9 భాషల్లో నటించాను 
  • 500కి పైగా సినిమాలు పూర్తిచేశాను 
  • వేంకటేశ్వరస్వామి మేకప్ కి 4 గంటలు పట్టేదన్న సుమన్

తెలుగు తెరపై యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేసినవారిలో సుమన్ ముందు వరుసలో కనిపిస్తాడు. తెలుగుతో పాటు మరో ఎనిమిది భాషల్లో ఆయన నటించారు. అలా ఇంతవరకూ ఆయన 500 సినిమాలను పూర్తి చేశారు. ఆయనకి బాగా పేరు తెచ్చిపెట్టిన పాత్రల్లో 'అన్నమయ్య' సినిమాలోని వేంకటేశ్వరస్వామి పాత్ర ఒకటి.

ఈ పాత్రను గురించి సుమన్ మాట్లాడుతూ .. 'అన్నమయ్య' సినిమాలోని వేంకటేశ్వరస్వామి పాత్ర కోసం నేను ప్రతిరోజూ 3:30 గంటలకే నిద్రలేచేవాడిని. ఉదయం 5 గంటలకు మొదలుపెడితే, 9 గంటలకు మేకప్ పూర్తయ్యేది. లంచ్ బ్రేక్ వరకూ కిరీటం కూడా తీసేవాడిని కాదు. లంచ్ బ్రేక్ తరువాత 2 గంటలకు మళ్లీ షూటింగ్ మొదలయ్యేది. డైరెక్టర్ గారు పేకప్ చెప్పేవరకూ అవే కాస్ట్యూమ్స్ తో ఉండేవాడిని. అలా వేంకటేశ్వర స్వామి పాత్ర కోసం ఎనిమిది నెలలపాటు కష్టపడ్డాను" అని చెప్పుకొచ్చారు.

Suman
Raghavendra Rao
Annamayya Movie
  • Loading...

More Telugu News