Tiktok: టిక్ టాక్ పరిచయంతో వ్యభిచారానికి ప్రోత్సహించిన స్నేహితురాళ్లు... యువతి సూసైడ్ అటెంప్ట్!

  • తమిళనాడులోని విల్లుపురంలో ఘటన
  • ఇంటికి పంపించి బెదిరించిన స్నేహితురాళ్లు
  • పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన

తనకు సోషల్ మీడియా వీడియో యాప్ టిక్ టాక్ ద్వారా పరిచయమైన స్నేహితురాళ్లు, వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తుండటంతో తట్టుకోలేకపోయిన ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన తమిళనాడులోని విల్లుపురం సమీపంలో జరిగింది.

 వివరాల్లోకి వెళితే, సత్యమంగళం గ్రామంలో కడల్ కన్ని (39), భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమెకు చెన్నైకి చెందిన సుమతి, లత, కవిత అనేవారు టిక్ టాక్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. ఆపై వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇద్దరు మగవాళ్లను పంపి, రూ. 2 లక్షలు ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు.

దీనిపై కడల్ కన్ని పోలీసులను ఆశ్రయించగా, వారు పట్టించుకోలేదని ఆరోపిస్తూ, ఆమె ఇంట్లోనే ఉరితాడు బిగించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన కుటుంబీకులు, వెంటనే ఆమెను కిందకు దించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Tiktok
Tamilnadu
Prostitution
Sucide Attempt
  • Loading...

More Telugu News