YSRCP: రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ వచ్చారు.. కాంగ్రెస్ పార్టీ వారసుడిగా మాత్రం కాదు!: అంబటి రాంబాబు

  • చాలా మంది వేస్తున్న లాజికల్ ప్రశ్న ఇది!
  • మర్రి చెన్నారెడ్డి హయాంలో కూడా ప్రయత్నాలు జరిగాయి
  • కాంగ్రెస్ నిర్ణయాన్ని వైఎస్ అమలు చేసారన్న అంబటి 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పడ్డ రాజకీయపార్టీ వైసీపీ అని, మరి, మండలి రద్దుకు ఎందుకు తీర్మానం చేశారని చాలా మంది లాజికల్ ప్రశ్న వేస్తున్నారని, దీనికి తాను సమాధానం చెబుతానంటూ అంబటి వివరించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కాదు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఉన్నప్పుడు కూడా మండలిని పునరుద్ధరించాలన్న ప్రయత్నాలు జరిగినా ఫలితం దక్కలేదని, 2007లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత మండలి పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని ఆ రోజున ఆయన అమలు చేశారని, ఆరోజున ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయం జరిగిందని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ వచ్చారని, ‘కాంగ్రెస్’ పార్టీ వారసుడిగా మాత్రం కాదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

YSRCP
Jagan
Ambati Rambabu
Rajashekar Reddy
Nandamuri Taraka RamaRao
Telugudesam
  • Loading...

More Telugu News