BJP: తెలంగాణలో జనసేతో కలిసి ముందుకు సాగుతాం: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • త్వరలో పవన్ కల్యాణ్ తో భేటీ
  • మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనైతికంగా వ్యవహరిస్తోంది
  • దొడ్డి దారిన ఛైర్మన్ పదవులను దక్కించుకోవాలనుకుంటోంది  

తెలంగాణలో జనసేనతో కలిసి పనిచేయడానికి బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఓ ప్రకటన చేశారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంలో తాము జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మెజారిటీ రాని స్థానాల్లో కూడా ఆ పార్టీ దొడ్డి దారిన ఛైర్మన్ పదవులను దక్కించుకోవాలనుకుంటోందని ఆరోపించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల పట్ల టీఆర్ఎస్ వైఖరి ఆక్షేపణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేకేను తెలంగాణలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు.

BJP
Lakshman
Janasena
Pawan Kalyan
Municipal Elections
Chairman Elections
  • Loading...

More Telugu News