Bachula Arjunudu: కొనుగోలు పథకం పారలేదని మండలి రద్దు నిర్ణయం: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల

  • వైసీపీ ప్రలోభాలకు సభ్యులు ఎవరూ లొంగలేదు
  • పోయిన పరువు కాపాడుకునే తాపత్రయం
  • ఇదో చేతకాని ప్రభుత్వం

ఏపీ కేబినెట్‌ శాసన మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు మూడురోజులపాటు వైసీపీ అనేక ప్రలోభాలకు పాల్పడిందని, అది సాధ్యంకాకపోవడంతో రద్దు నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేశారు. ఓ టీవీ చానెల్‌ తో ఈ రోజు ఆయన మాట్లాడుతూ పోయిన పరువు కాపాడుకునే ప్రయత్నంలో భాగమే రద్దు నిర్ణయం తప్ప, శాసన మండలి రద్దు ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని చెప్పారు. రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం రాజ్యమేలుతోందని, ఇదో అసమర్థ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు.

Bachula Arjunudu
MLC
AP Legislative Council
  • Loading...

More Telugu News