YSRCP: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ.. గవర్నర్, అసెంబ్లీ స్పీకర్‌కు టీడీపీ శాసనసభా పక్షం లేఖ
- శాసన మండలి రద్దుపై చంద్రబాబు చర్చ
- తాజా రాజకీయ పరిణామాలపై కీలక భేటీ
- సభల నిర్వహణలో బీఏసీ అజెండాను ఉల్లంఘించారని గవర్నర్‌కు ఫిర్యాదు
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. శాసన మండలి రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము ఎలా వ్యవహరించాలన్న విషయంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించి ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు, గవర్నర్, శాసనసభ స్పీకర్ కు టీడీపీ శాసనసభా పక్షం లేఖ రాసింది. సభల నిర్వహణలో బీఏసీ అజెండాను ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలని బీఏసీలో నిర్ణయించారని తెలిపింది. బీఏసీకి చెప్పకుండానే ఇష్టానుసారం సభను మరో మూడు రోజుల పాటు పొడిగించారని ఫిర్యాదు చేసింది. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులపై అసెంబ్లీలో చర్చించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పింది.