Burj Khalifa: బుర్జ్ ఖలీఫా టవర్స్ పై మెరిసిన మువ్వన్నెల పతాకం

  • ఘనంగా భారత 71వ రిపబ్లిక్ డే వేడుకలు
  • ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణ పతాకావిష్కరణలు
  • బుర్జ్ ఖలీఫా టవర్స్ కు విద్యుద్దీప కాంతులతో ముస్తాబు

భారత 71వ గణతంత్ర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి చాటుకున్నారు. అంతేకాదు, దుబాయ్ లో ఆకాశాన్నంటుతున్నట్టుగా ఉండే ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా టవర్స్ కూడా త్రివర్ణ పతాకం రంగులతో మెరిసిపోయింది. ఈ టవర్ ను భారత జాతీయపతాకం రంగులు ప్రతిబింబించేలా విద్యుద్దీప కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. దీన్ని చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.

Burj Khalifa
Towers
Dubai
Indian Flag
Republic Day
India
  • Error fetching data: Network response was not ok

More Telugu News