kcr: కేసీఆర్ హిందువుగా పుట్టినందుకు భారతదేశం సిగ్గుపడుతోంది: బీజేపీ ఎంపీ అరవింద్

  • సీఎం స్థాయికి తగ్గట్టుగా కేసీఆర్ మాట్లాడటం లేదు
  • బీజేపీ హవా రాష్ట్రంలో కొనసాగుతోంది
  • మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ లో టీఆర్ఎస్ ది మూడో స్థానం

బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై నిన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సీఎం కేసీఆర్ పై ఎంపీ అరవింద్ నిప్పులు చెరిగారు. నిజామాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హిందువుగా పుట్టినందుకు, ముఖ్యమంత్రిగా ఉన్నందుకు భారతదేశం సిగ్గుపడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా కేసీఆర్ మాట్లాడటం లేదని, ‘చీఫ్ మినిస్టర్ ‘చీప్’గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ లో టీఆర్ఎస్ కు ప్రజలు మూడో స్థానాన్ని కట్టబెట్టారని అన్నారు. ఇందూరు ప్రజలు బీజేపీకి అనుకూలంగా, ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ హవా కేవలం నిజామాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు. నిజామాబాద్ లో మేయర్ పదవిని బీజేపీకి కట్టబెట్టాలని ఈ విషయమై టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు.

kcr
TRS
cm
BJP
Dharmapuri Aravind
mp
  • Error fetching data: Network response was not ok

More Telugu News