Rajamouli: 'ఆర్ఆర్ఆర్' సెట్స్ పై రిపబ్లిక్ డే వేడుకలు... నిరాశకు గురైన అభిమానులు

  • దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాజమౌళి
  • ఫొటోల్లో చరణ్, ఎన్టీఆర్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి. ఇప్పుడాయన దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం కూడా స్వాతంత్రోద్యమ కాలం నేపథ్యంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో, రిపబ్లిక్ డే సందర్భంగా తమ చిత్రం షూటింగ్ కంటే ముందు సెట్స్ పై రాజమౌళి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. అయితే, అభిమానులు మాత్రం రాజమౌళిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సెట్స్ పై జరిగిన రిపబ్లిక్ డే వేడుకలో ఎక్కడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. ఫొటోల్లో తమ అభిమాన తారలు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Rajamouli
Republic Day
RRR
Ramcharan
Jr NTR
Fans
Tollywood
  • Loading...

More Telugu News