Jaggareddy: టీఆర్ఎస్ కు ప్రజలు ఎలా ఓటేస్తున్నారో అర్థం కావడం లేదు!: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • ఇచ్చిన హామీలు టీఆర్ఎస్ నెరవేర్చలేదు
  • డబ్బులతో ఎన్నికలను టీఆర్ఎస్ శాసిస్తోంది
  • హరీశ్ కు, కేటీఆర్ కు అభినందనలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ కు ప్రజలు ఎందుకు ఓటేస్తున్నారో అర్థం కావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. డబ్బులతో ఎన్నికలను టీఆర్ఎస్ శాసిస్తోందని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో చాలా చోట్ల తక్కువ మెజార్టీతోనే టీఆర్ఎస్ గెలిచిందని అన్నారు. ఇదే సమయంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను ప్రశంసించారు. తన రెండు మున్సిపాలిటీలను గెలిపించుకున్న హరీశ్ కు, వందకు పైగా సీట్లు గెలుస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న కేటీఆర్ కు తన  అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు.

Jaggareddy
Sangareddy
Mla
KTR
Harish Rao
  • Loading...

More Telugu News