earth quake: మరికొన్ని రోజుల వరకు భూమిలో కదలికలు.. కంపించినప్పుడు ఇళ్ల నుంచి బయటకు రండి: శ్రీనగేశ్

  • రాత్రి నుంచి 11 సార్లు చిన్నపాటి భూప్రకంపనలు
  • భూకంపలేఖినిపై తీవ్రత 4.6గా నమోదైంది
  • కట్టడాలు పటిష్ఠంగా లేకపోతే ప్రాణ, ఆస్తినష్టం జరిగే ప్రమాదం

తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపంపై  భూభౌతిక పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనగేశ్ పలు వివరాలు తెలిపారు. నిన్న రాత్రి నుంచి 11 సార్లు చిన్నపాటి భూప్రకంపనలు వచ్చాయని స్పష్టతనిచ్చారు. భూకంపలేఖినిపై తీవ్రత 4.6గా నమోదైందని చెప్పారు.

మరికొన్ని రోజుల వరకు భూమిలో ఇలాంటి కదలికలు వస్తాయని తెలిపారు. కట్టడాలు పటిష్ఠంగా లేకపోతే ప్రాణ, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుందని, సెస్మిక్‌ జోన్‌2లో ఉన్న సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. అయితే, భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని,
భూమి కంపించినప్పుడు ఇళ్ల నుంచి బయటకు రావడమే సురక్షితమని అన్నారు.

earth quake
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News