Suresh Raina: ధోనీ చాలా ఫిట్ గా ఉన్నాడు... జట్టుకు అతను కావాలి: రైనా కీలక వ్యాఖ్యలు

  • గత సంవత్సరం ఐపీఎల్ తరువాత క్రికెట్ కు దూరమైన రైనా
  • టీ-20 వరల్డ్ కప్ పోటీలే టార్గెట్
  • ధోనీ సత్తా ఐపీఎల్ లో తెలుస్తుందన్న రైనా

మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం పూర్తి ఫిట్ గా ఉన్నాడని, భారత క్రికెట్ జట్టుకు అతని అవసరం ఎంతైనా ఉందని సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు. గత సంవత్సరం ఐపీఎల్ తరువాత, ఎడమ మోకాలి గాయంతో క్రికెట్ కు దూరమైన రైనా, ధోనీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎస్కే ట్రయినర్ గ్రెగ్ కింగ్ తో వద్ద శిక్షణ తీసుకుంటున్న రైనా, తనను కలిసిన మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియాలో ఈ సంవత్సరం జరిగే టీ-20 వరల్డ్ కప్ పోటీలకు ఎంపిక కావడమే తన ముందున్న లక్ష్యమని చెప్పాడు. తనకు తగిలిన మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, రంజీ ట్రోఫీలో ఆడేందుకు అవకాశం వచ్చినా, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు ఇంకా సన్నద్ధం కాలేదన్న ఉద్దేశంతోనే తాను దూరంగా ఉన్నానని చెప్పాడు. ధోనీ సత్తా ఏంటో ఐపీఎల్ లో తెలుస్తుందన్న నమ్మకముందని అన్నాడు. ధోనీ వంటి ఆటగాడు జట్టులో ఉంటే, మిగతా ఆటగాళ్లందరికీ ఎంతో స్ఫూర్తి లభిస్తుందని సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు. 

Suresh Raina
MS Dhoni
Cricket
IPL
  • Loading...

More Telugu News