Jagan Shakti: ప్రాణాపాయ స్థితిలో 'మిషన్ మంగళ్' దర్శకుడు జగన్ శక్తి!

  • మెదడులో గడ్డకట్టిన రక్తం
  • ఆరోగ్యం విషమించిందన్న వైద్యులు
  • కోలుకోవాలని ప్రార్థిస్తున్న బాలీవుడ్

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ జగన్ శక్తి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఆయన ఉన్నట్టుండి స్పృహ కోల్పోగా, పరిశీలించిన వైద్యులు, మెదడులో రక్తం గడ్డ కట్టిందని తేల్చారు. గత సంవత్సరం అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన 'మిషన్ మంగళ్'కు జగన్ శక్తి దర్శకత్వం వహించారు.  అంతకుముందు 'చీనీ కమ్' సహా పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశారు.

మెదడులోని రక్తం గడ్డ కట్టిన కారణంగా ఆయన ఆరోగ్యం విషమించిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, స్నేహితులు, ముంబైకి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జగన్ శక్తి, తన తదుపరి చిత్రం కోసం అక్షయ్ కుమార్ తో చర్చలు జరుపుతున్న వేళ ఈ ఘటన జరిగింది.

Jagan Shakti
Mission Mangal
Hospital
Bollywood
  • Loading...

More Telugu News