padma shri: గాయకుడు అద్నాన్ సమీకి ‘పద్మశ్రీ’.. అవసరం ఏమొచ్చిందన్న ఎంఎన్ఎస్!
- సమీకి ‘పద్మశ్రీ’పై ఎంఎన్ఎస్ తీవ్ర అభ్యంతరం
- పౌరసత్వం తీసుకున్న నాలుగేళ్లకే ఎందుకని ప్రశ్న
- ప్రభుత్వం తీరు సరికాదని మండిపాటు
బాలీవుడ్ ప్రముఖ సింగర్ అద్నాన్ సమీకి కేంద్రం ‘పద్మశ్రీ’ పౌర పురస్కారం ప్రకటించడాన్ని మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) తప్పుబట్టింది. భారత పౌరసత్వం తీసుకున్న నాలుగేళ్లకే ఆయనకు ‘పద్మశ్రీ’ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎంఎన్ఎస్ సినిమా విభాగపు అధ్యక్షుడు ఖోప్కర్ ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు సరికాదని మండిపడ్డారు.
కాగా, తనకు ‘పద్మశ్రీ’ ప్రకటించడంపై స్పందించిన సమీ.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదో అద్భుత క్షణమని వ్యాఖ్యానించారు. తాను సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి 34 ఏళ్లు పూర్తయ్యాయన్న సమీ.. ప్రభుత్వం నుంచి దక్కిన ఈ గుర్తింపుతో తానెంతో ఆనందంగా ఉన్నానని పేర్కొన్నారు.