PV Sindhu: ఐదుగురు తెలుగువాళ్లకు 'పద్మ' పురస్కారాలు

  • 'పద్మ' అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • క్రీడారంగంలో సింధుకు పురస్కారం
  • అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న తెలుగుతేజం

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు కేంద్రం క్రీడారంగంలో 'పద్మభూషణ్' ప్రకటించింది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న సింధు ప్రతిభకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం వరించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఐదుగురు తెలుగువాళ్లకు పురస్కారం లభించింది. పీవీ సింధు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపికైంది. శ్రీభాష్యం విజయసారథి (విద్య, సాహిత్యం), చిన్నతల వెంకటరెడ్డి (వ్యవసాయ రంగం)లకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. ఏపీ నుంచి ఎడ్ల గోపాలరావు (కళారంగం),  దళవాయి చలపతిరావు (కళారంగం)లను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారు.

PV Sindhu
Padmabhushan
Telangana
Sports
Badminton
Padmasree
Andhra Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News