BJP: డీజీపీ గౌతం సవాంగ్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు

  • డీజీపీని కలిసిన కన్నా, మాణిక్యాలరావు
  • ధర్నా కేసులు ఎత్తివేయాలని వినతి
  • బీజేపీ శ్రేణులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు కలిశారు. 2018లో బీజేపీ యూత్ వింగ్ విభాగం ధర్నాకు సంబంధించిన కేసులను ఎత్తివేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ శ్రేణులపై మతపరమైన దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెనాలి, కదిరి, కడప, నెల్లూరు, ఆదోనిలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించారు. బీజేపీ శ్రేణులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా గౌతం సవాంగ్ ను వారు కోరారు.

BJP
Andhra Pradesh
DGP
sawang
kanna
  • Loading...

More Telugu News