Actor Suman: రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమే: సినీ నటుడు సుమన్

  • కొత్త ప్రభుత్వమొస్తే.. కొత్త నిర్ణయాలు సహజమే
  • యువకుడైన జగన్ కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు
  • రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

సినీ నటుడు సుమన్ తన రాజకీయ ప్రవేశంపై సంకేతాలిచ్చారు. అవకాశం కల్పిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారు. ఈ రోజు సుమన్ గుంటూరు జిల్లా మాచర్లలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ మాజీ శాసన సభ్యుడు గౌతు లచ్చన్న కుమారుడు శ్యామ్ సుందర్ శివాజీ తదితర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. రాజధాని రైతుల సమస్యలను తప్పనిసరిగా పరిష్కారించాలని డిమాండ్ చేశారు. రైతులు కోరితే మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త నిర్ణయాలు తీసుకోవడం సహజమని వ్యాఖ్యానించారు. అవకాశం కల్పిస్తే.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. యువకుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నారన్నారు.

Actor Suman
political Entry
Andhra Pradesh
Gouthu Lachanna
Statue
Unveil
  • Loading...

More Telugu News