KTR: తెలంగాణ ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకున్న కేటీఆర్

  • మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి
  • ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్
  • తిరుగులేని విజయం అందించారని వ్యాఖ్యలు

తెలంగాణలో 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ జయభేరి మోగించింది. 100కి పైగా మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వంపై మరోసారి ప్రగాఢ నమ్మకం ఉంచినందుకు తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ట్విట్టర్ లో స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారని కొనియాడారు. 100కి పైగా మున్సిపాలిటీలు, తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో విజయం మామూలు విషయం కాదని పేర్కొన్నారు.

KTR
Voters
Telangana
Municipal Elections
TRS
  • Loading...

More Telugu News