Uday Raj Kumar: 'భైరవద్వీపం' నుంచే నా పేరును మార్చారు: నటుడు విజయరంగరాజు

  • నా అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్
  • ఫైటర్ గా కొన్ని సినిమాలు చేశాను
  • ఆ డైరెక్టర్ నాకు స్వయంగా చెప్పాడన్న విజయరంగరాజు

'భైరవద్వీపం' సినిమా చూసినవారికి ఆ సినిమాలోని మాంత్రికుడి రూపం ఇప్పటికీ గుర్తుంటుంది .. ఆయన పేరే విజయరంగరాజు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పుకొచ్చారు. "నా అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్. తొలినాళ్లలో రాజ్ కుమార్ పేరుతో ఫైటర్ గా కొన్ని సినిమాలు చేశాను.

'భైరవద్వీపం' సినిమా సమయంలో దర్శక నిర్మాతలు నా పేరును మారుస్తున్నట్టు చెప్పారు. విజయ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా రూపొందుతుంది గనుక 'విజయ' అని .. ఎస్వీ రంగారావు తరహా పాత్రను చేస్తున్నాను గనుక 'రంగ' అని .. నా అసలు పేరులోని 'రాజ్' కలిసొచ్చేలా 'విజయరంగరాజు'గా మార్చారు. ఈ పేరు నాకు బాగానే కలిసొచ్చింది. నా పేరు చివరిలో 'రాజు' అని ఉండటం వలన, వేరే కులానికి చెందిన ఒక డైరెక్టర్ ఐదారు వేషాలు నాకు ఇవ్వలేదని స్వయంగా చెప్పాడు" అంటూ నవ్వేశారు.

Uday Raj Kumar
Vijaya Ranga Raju
Bhairava Dveepam Movie
  • Loading...

More Telugu News