KTR: తెలంగాణ భవన్ లో కేటీఆర్.. సందడి వాతావరణం

  • మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు
  • క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతున్న టీఆర్ఎస్
  • తెలంగాణ భవన్ లో ఫలితాల సరళిని తెలుసుకుంటున్న కేటీఆర్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు ముందు ఇతర పార్టీలు బేజారయిపోయాయి. ఓట్ల లెక్కింపు తొలి ట్రెండ్స్ లో టీఆర్ఎస్ హవా చాటుతోంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కొన్ని చోట్ల మినహా దాదాపుగా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతూ... క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది.

 ఈ నేపథ్యంలో హైదరాబాదులోని టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ నేతలు వరుసగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లోనే ఉండి ఫలితాల సరళిని తెలుసుకుంటున్నారు. వెలువడుతున్న ఫలితాలతో పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ విశ్లేషణ చేస్తున్నారు.

KTR
TRS
Telangana Municipal Elections
  • Loading...

More Telugu News