Crime News: ఉరేసుకుని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య!

  • కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఘటన
  • నిన్న రాత్రి ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు
  • ఉదయానికి విగత జీవిగా మారిన వైనం

పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి ట్యూషన్‌కు వెళ్లిన కొడుకు తెల్లారేసరికి ఇక లేడన్న వార్తతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతాఇంతాకాదు. ఆ వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం జెడ్పీ ఉన్నత పాఠశాలలో  దీపక్‌ పదో తరగతి చదువుతున్నాడు. నిన్న రాత్రి ఎప్పటిలాగే ట్యూషన్‌కు వెళ్లాడు. ఉదయం లేచేసరికి పాఠశాల ప్రాంగణంలో చీరతో ఉరేసుకుని కనిపించడంతో సిబ్బంది షాక్ తిన్నారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Crime News
tenth student
suicide
Krishna District
srikakulam
  • Loading...

More Telugu News