Infant: బెంగళూరులో బాలభీముడు పుట్టాడు... బరువు 5.9 కిలోలు!
- బెంగళూరులో స్థిరపడిన డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన దంపతులు
- నెలలు నిండడంతో వైద్యపరీక్షలు
- మొదట కవలలుగా భావించిన వైద్యులు
డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన యోగేశ్, సరస్వతి దంపతులు గత కొన్నేళ్లుగా బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సరస్వతికి నెలలు నిండడంతో ఇటీవల ఆసుపత్రికి వెళ్లగా వైద్యపరీక్షలు చేసి కవల పిల్లలు పుట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ఆమె బరువు 80 కిలోలు ఉండడంతో వైద్యులు కవలలుగా భావించారు.
అయితే, ప్రసవం తర్వాత వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆమెకు ఒక్క మగశిశువు మాత్రమే జన్మించాడు. అయితే అసాధారణ రీతిలో 5.9 కిలోల బరువున్నాడు. సాధారణంగా అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన శిశువులు 3 కేజీలవరకు బరువు ఉంటారు. ఈ బాలభీముడు మాత్రం ఐదు కేజీలకు పైగా బరువు తూగి అందరినీ విస్మయానికి గురిచేశాడు. యోగేశ్, సరస్వతి దంపతులకు ఇప్పటికే ఓ బిడ్డ ఉండగా, 14 ఏళ్ల తర్వాత ఇలా రెండో బిడ్డకు జన్మనిచ్చారు.