Chetan: మొక్కలను మొలికించే శుభలేఖ.. కన్నడ సినీ నటుడి వినూత్న ఆహ్వాన పత్రిక!

  • మేఘ అనే అమ్మాయితో కన్నడ హీరో చేతన్ పెళ్లి
  • పెళ్లికార్డును భూమిలో నాటి నీరు పోస్తే మొక్కలు వస్తాయన్న చేతన్
  • పర్యావరణ పరిరక్షణ కోసం నడుంబిగించిన యువ హీరో 

సాధారణంగా పెళ్లికార్డులను అత్యంత ఆకర్షణీయంగా రూపొందించి అతిథులకు అందించాలని కోరుకుంటారు. ఎవరిస్థాయికి తగిన విధంగా ఆ పెళ్లిపత్రికలను అందంగా ముస్తాబు చేస్తుంటారు. అయితే కన్నడ యువ హీరో చేతన్ మాత్రం తన వివాహ శుభలేఖలో పర్యావరణ హితాన్ని జోడించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మేఘ అనే సామాజిక ఉద్యమకారిణితో చేతన్ పెళ్లి ఫిబ్రవరి 2న జరగనుంది. ఈ నేపథ్యంలో చేతన్ తన పెళ్లికార్డులో కొన్ని విత్తనాలను అతిథులకు అందిస్తున్నాడు. ఆ శుభలేఖలో విత్తనాలు అంటించి ఉన్న ఓ ప్రత్యేకమైన భాగాన్ని భూమిలో నాటి నీరు పోస్తే చాలని, అవి మొక్కలుగా పెరిగి పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడతాయని చేతన్ పిలుపునిచ్చాడు.

చేతన్ తల్లిదండ్రులు తమ కుమారుడి పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించాలని భావించారు. కానీ, పెళ్లికోసం ఇంత ఖర్చు చేయడం ఎందుకని భావించిన ఆ యువ హీరో వినోబాభావే ఆశ్రమంలో నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అత్యంత ఆడంబరంగా పెళ్లి చేసుకుని తమ స్టేటస్ చాటాలని ప్రయత్నించే వారున్న ఈ కాలంలో చేతన్ లాంటి వాళ్లు నిజంగా ఆదర్శప్రాయులే!

Chetan
Kannda
Hero
Wedding Card
Seeds
Environment
  • Error fetching data: Network response was not ok

More Telugu News