Vijayashanti: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్సే గెలుస్తుందంటున్నారు... ఈ క్రెడిట్ కూడా కేటీఆర్ ఖాతాలోనే వేస్తారు: విజయశాంతి

  • తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
  • ఫలితాల కోసం వేచిచూస్తున్న ప్రజలు, పార్టీలు
  • ఫేస్ బుక్ లో స్పందించిన విజయశాంతి

తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ పూర్తయి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఆధిపత్యం చలాయిస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, చూస్తుంటే ఈ క్రెడిట్ ను కూడా మంత్రి కేటీఆర్ ఖాతాలోనే వేస్తారనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో విపక్షాలు సైతం కేటీఆర్ పట్టాభిషేకమే ఇక తరువాయి అంటున్నాయని, ఇది టీఆర్ఎస్ హైకమాండ్ కు లాభించే అంశమని తెలిపారు. విపక్ష నేతలే ఇలా చెబుతుంటే ప్రజల్లోకి కేటీఆర్ పట్టాభిషేకం విషయం బాగా చొచ్చుకుని పోతోందని, తద్వారా జనాల్లో కేటీఆర్ ఇమేజ్ పెరుగుతుందని  వివరించారు. ఏదేమైనా టీఆర్ఎస్ భావి సీఎం అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని ఫేస్ బుక్ లో వెల్లడించారు.

Vijayashanti
Congress
Telangana Municipal Elections
KCR
KTR
TRS
  • Loading...

More Telugu News